2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు శాంతి కుమారి, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా వీళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు అని పేర్కొన్నాడు. సర్వే వివరాలను ఓపెన్‌గా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు.