రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేక సందేశం ఇచ్చారు. "హోలీ మీ జీవితాల్లో ఆనందం, శాంతి, సంతోషాన్ని నింపాలని, హరివిల్లు రంగుల్లా భవిష్యత్తు వెలుగొందాలని" ఆకాంక్షించారు. ప్రజలు సౌహార్దపూర్వకంగా, ఉల్లాసంగా హోలీ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.