గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో మంత్రి సీతక్క

55చూసినవారు
హైదరాబాద్ నాంపల్లి లోని గాంధీ భవన్ లో మంగళవారం మంత్రులతో ముఖాముఖిలో భాగంగా మంత్రి సీతక్క ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని సీతక్క ప్రజలకు హామీ ఇచ్చారు. మంత్రి సీతక్క వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్