కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సంబంధించిన కేసులో మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. కాళేశ్వరం భూసేకరణ అంశంలో మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. శ్రీధర్‌బాబు సహా 13 మందిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. 2017లో శ్రీధర్‌బాబు సహా పలువురు 13 మంది కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.