మల్లేపల్లి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ జాఫర్ ఖాన్ గురువారం పర్యటించారు. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. డివిజన్ పరిధిలో ఎక్కడా చెత్త లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పారిశుద్ధ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.