కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో లంబాడీలు కీలక పాత్ర పోషించారని బంజారా గిరిజన సంఘాల జేఏసీ నేత డా, వెంకటేష్ చౌహాన్ అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్టీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి బదులు మంత్రి పదవి ఇవ్వాలని తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నరు.