నాంపల్లి: ఒకే వేదికపై మజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్

189చూసినవారు
నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఒకే వేదికపై కనిపించారు. విజయనగర్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో శనివారం జరిగిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. 81 మంది దేవాలయ ధర్మకర్తలకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు. కాగా మజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్ ఉప్పు నిప్పుల ఉంటారనే విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్