నాంపల్లి: గ్రూప్-4 తుది ఫలితాల కోసం అభ్యర్థుల పోస్ట్ కార్డు నిరసన

58చూసినవారు
నాంపల్లి: గ్రూప్-4 తుది ఫలితాల కోసం అభ్యర్థుల పోస్ట్ కార్డు నిరసన
గ్రూప్-4 పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా, తుది ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడం వలన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టీజీపీఎస్సీకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా తమ వినతి పత్రాలు పంపి, గ్రూప్-4 ఫలితాలు వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు బుధవారం డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-4 సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి, త్వరితగతిన నియామక పత్రాలు ఇచ్చి, 8 వేల నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్