మెహిదీపట్నం డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ పార్కు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. పార్కు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో స్థానికులు చెత్తను వేస్తున్నారు. దీంతో విధి కుక్కలు, ఇతర జంతువులు వచ్చి మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. ప్రతిరోజూ వచ్చే శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే చెత్తను క్లియర్ చేసి పకడ్బందీగా నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.