దేశమంతటా మోడీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు, నీతివంతమైన పాలన అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తున్నాయని, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావలసిన అవసరం ఉందన్నారు. బిజెపితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.