మెహిదీపట్నం ఎల్ఐసీ కాలనీలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై అడుగులోతూ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షానికే రోడ్డుపై గుంతలు పడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరల సమస్య పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.