దేశంలో అవినీతి పెరుగుతున్నదని, రాజకీయాల్లో నైతికత లేకుండా పోతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు అమ్ముకోవడం ద్వారా అవినీతిలో భాగస్వాములవుతున్నారని విమర్శించారు. విద్యార్థులను రాజకీయ చైతన్యానికి దూరం చేయడం సమాజానికి నష్టమన్నారు.