సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత

75చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి కొత్త హంగులు అద్దుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడున్న రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నారు. భారీ నిర్మాణాలు, మార్పులు జరుగుతున్నాయి. ఈ భారీ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రానున్న 100 రోజుల పాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించనున్నారు.

సంబంధిత పోస్ట్