తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం జనాభా లెక్కలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నలు లేవనెత్తారు. 2014 సమగ్ర సర్వే, కుల గణన మధ్య 21 లక్షల జనాభా తగ్గిందని ఆయన ఆరోపించారు. జనాభా తగ్గుదలకు గల కారణాలను ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. సర్వేల్లో లోపాలున్నాయా? వలసలు, జనన, మరణాల రేటులో మార్పుల వల్లా ఈ వ్యత్యాసం వచ్చిందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.