హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. గతంలో ప్రొక్లయిమ్డ్ అఫెండర్‌గా ప్రభాకర్‌రావును ప్రకటించేందుకు కోర్టు నోటీసులు పంపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 20లోపు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇవాళ నోటీసులపై కోర్టులో హాజరయ్యేందుకు ప్రభాకర్‌రావు న్యాయస్థానానికి వచ్చారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.