భారతదేశంలో రాజ్యాంగం కాపాడుతుంది అంటే దానికి కర్త, కర్మ, క్రియ కేవలం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వల్లనే అని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. నేడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఓయూలో బుధవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ప్రజల కష్టాలు చూసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు.