తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాల జేఏసీ డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలో బంద్ కు పిలుపునిచ్చాయి. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ఆటో ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సు పథకం తమ పొట్టకొట్టిందన్నారు. ఈ స్కీం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు అని బిఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య విమర్శించారు.