
క్రీడా పోటీల్లో గాయపడిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
AP: విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలోఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల జరుగుతున్నాయి. ఈ క్రీడా పోటీల్లో సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్రికెట్ ఆడారు. అయితే క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తూ విజయ్ కుమార్ ఒక్కసారిగా కిందపడడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనకు చికిత్స అందించారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.