BREAKING: అర్చకుల కనీస వేతనం పెంపు
AP: దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ మంగళవారం ప్రకటించారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే వారి వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు. ''అర్చకులకు రూ.15వేల వేతనం ఇవ్వాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధిచేకూరనుంది. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుంది'' అని ఆనం వెల్లడించారు.