గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని నిరుద్యోగుల నిరసన

74చూసినవారు
గ్రూప్-4 ఫలితాలు ప్రకటించాలని నిరుద్యోగుల నిరసన
గ్రూప్-4 పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం నాంపల్లి లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా తాము ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని, ఫలితాల ఆలస్యం కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని వారు తెలిపారు. మనోహర్, వర్మ, ప్రణయ్, కృష్ణ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్