లయన్స్ క్లబ్ 320 H 2025-26 సంవత్సరానికి AI డిస్ట్రిక్ట్ సెక్రెటరీగా నికీలు గుండా నియమితులైనట్లు డిస్ట్రిక్ట్ గవర్నర్ (E) లయన్ గంపా నాగేశ్వర రావు ఏప్రిల్ 11, 2025న సికింద్రాబాద్ లయన్స్ భవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రకటించారు. నికీలు గుండా AI రంగంలో నిపుణుడిగా సభ్యులకు AI ఆధారిత వ్యాపార వ్యూహాలు,స్మార్ట్ నిర్ణయాలు,ఆటోమేషన్, మరియు కస్టమర్ సేవల మెరుగుదలపై పాఠాలు అందిస్తున్నారు. ఆయన వర్క్‌షాప్‌ల ద్వారా లయన్స్ సభ్యుల వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి ఎదిగేలా మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నియామకం లయన్స్ సభ్యులకు AI శక్తిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని గంపా నాగేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నికీలు గుండాకు పలువురు ప్రత్యక్షంగా,పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపారు..