ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ టీ-హబ్‌లో ప్రముఖ AI మెంటార్ నికీలు గుండా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ గ్రోత్ వర్క్‌షాప్‌లో, సాధారణ కుటుంబంలో పుట్టి సంగీత అభిరుచిని వృత్తిగా మలచుకుని, ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 9 ఫైనలిస్ట్‌గా దేశవ్యాప్త గుర్తింపు సాధించిన హైదరాబాద్ గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఎన్నో సవాళ్లను, కష్టాలను అధిగమించి ఉన్నత స్థాయికి చేరిన రోహిత్, తన స్ఫూర్తిదాయక కథను బిజినెస్ నిపుణులతో పంచుకోనున్నారు. ఇండియన్ ఐడల్‌లో తీవ్ర పోటీ, స్టేజ్ ఒత్తిడిని ఎదుర్కొని, సోనూ నిగమ్, అనూ మాలిక్ వంటి దిగ్గజాల ప్రశంసలు పొందిన రోహిత్, సినిమా గీతాలతో లక్షల మనసులను గెలిచారు. సామాజిక మాధ్యమాల్లో సొంత బ్రాండ్‌ను నిర్మించుకున్న ఆయన, ఈ వర్క్‌షాప్‌లో అభిరుచిని వ్యాపారంగా ఎలా మలచాలి, సవాళ్లను అవకాశాలుగా ఎలా మార్చాలో వివరించనున్నారు. పట్టుదల, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించిన తన అనుభవాలను అందరితో చర్చించనున్నారు.