నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తి 2,09,248 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,78,905 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2,51,238 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310.5510 టీఎంసీలుగా ఉంది.