చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు అయిన సుమారు రూ. 27 లక్షల విలువగల 78 చెక్కులను పలు డివిజన్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్దె ధ్యేయంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.