కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ త్రి మంకీస్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఎన్ఎంసి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఅర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.