
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు
గత రెండు రోజుల వరకు తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.950 పెరిగి రూ.88,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.990 పెరిగి రూ.96,170కి చేరింది. కేజీ వెండి ధరపై రూ.200 పెరగడంతో రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.