అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సందీప్ కుమార్ యాదవ్ అనే యువకుడు మృతి చెందాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన రాం ఆశీష్ చిన్న కుమారుడు సందీప్ రెండేళ్ల క్రితం మాస్టర్స్ చేయడానికి అమెరికాలోని ఒహాయో వెళ్లాడు. ఈ నెల 17న రాత్రి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.