కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం125వ డివిజన్ లెనిన్ నగర్ లో సన్నబియ్యం లబ్దిదారులు లక్ష్మమ్మ భాస్కర్ దళిత కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వారి కుటుంబ సభ్యులతో మంగళవారం కలిసి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం లబ్ధిదారుని ఇంట్లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలువేసి లక్ష్మమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.