కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ కార్పొరేటర్లు తో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ని కలిసి నియోజకవర్గ సమస్యలపై శనివారం వినతి పత్రాన్ని అందించారు. ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే లైన్లు, రోడ్లుకు సంబంధించి సమస్యలు పరిష్కరించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. దీనికి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించడం జరిగింది.