నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26 వార్డ్ ప్రశాంతి నగర్ ఎస్వీఎస్ ప్యారడైజ్ అపార్ట్మెంట్ ప్రజలు గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని కొలను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం స్వయంగా వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ , బాలకృష్ణ , అల్లాడి మహేష్, కాలనీవాసులు ఎన్ఎంసి సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.