నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ మంకీ జంక్షన్‌లో ఆదివారం శ్రీ వాసవి సేవక్ ఆధ్వర్యంలో 2000ల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలంగాణ వాసవి సేవక్ ప్రెసిడెంట్ అల్లాడి మహేష్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాస్ రెడ్డి, కొలను రాజశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.