
ఏపీఎస్ఆర్టీసీకి బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్గా కొనకళ్ల నారాయణ సహా ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, 11మంది అధికారులతో ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో బోర్డు ఏర్పాటు జరిగింది.