కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎస్ఆర్ నాయక్ నగర్ శ్రీ పెద్దమ్మ, పోచమ్మ తల్లి ఆలయ 20వ వార్షిక మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు.