కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పీ వివేకానంద్ గౌడ్ ను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ విప్ గా నియమించిన సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం చింతల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, పూల గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.