శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ విప్ గా నియమితులైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని బుధవారం కొంపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రజిత రవికాంత్, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్, మాజీ కౌన్సిలర్ నాచారం సునీత మురళీ యాదవ్, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.