కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో దారుణం జరిగింది. ఫోన్ లో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే కూతురిని తండ్రి మందలించాడు. మనస్థాపంతో కూతురు తేజస్విని (19) ఇంటర్ విద్యార్థిని సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.