కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని హనుమాన్ దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుమారుని హనుమాన్ మాలధారణ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆంజనేయ స్వామివారి పూజలో పాల్గొన్నారు. కూన శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహనుమాన్ మాలధారణలో ఉన్న స్వాములతో కలిసి ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకం, పూలహారాలు స్వాముల భజన మంత్రాల మధ్య శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.