కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి 54వ బ్రహ్మోత్సవాలలో మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మధ్య స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.