
విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
AP: అప్పటి వరకు స్నేహితులతో ఉత్సాహంగా గడిపిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లులో జరిగింది. వీరేశ్ అనే యువకుడు బంధువుల పెళ్లికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు వీరేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు రావడం వల్లే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.