కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో తన నివాసం వద్ద ఆదివారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ వెంకటేశ్వర్ నాయక్ కి శుభాకాంక్షలు తెలిపారు.