కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో మే 17న ట్యాంక్ బండ్ పై నిర్వహించే తిరంగా ర్యాలీ సందర్భంగా కొంపల్లి ఎఎమ్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 17న నిర్వహించే తిరంగా ర్యాలీలో కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు.