కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండీగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరం పెట్ లోఈ నెల12తారీకున నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచార యత్నం జరిగిందిందని, ఘటన పై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, మెడికల్ రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని బుధవారం డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డినీ కలిసి కోరారు.