కుత్బుల్లాపూర్: ఓఎల్ఎక్స్ లో ప్రభుత్వ భూమి అమ్మకం పై ఫిర్యాదు

66చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ సర్వేనెంబర్ 307లో ఉన్న ప్రభుత్వ భూమిలో 16 ఎకరాల విస్తీర్ణంలో 468 ప్లాట్లను వెంచర్ వేసి అమ్మకాలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో బిజెపి నేత ఆకుల సతీష్ గురువారం ఫిర్యాదు చేశారు. కబ్జాదారులు ఏకంగా ప్లాట్లను అమ్మటానికి ఓఎల్ఎక్స్ లో ప్రకటనలు ఇచ్చి మరి ప్రభుత్వ భూమిని కొనుగోలుదారులకు అంతకంటే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :