
ఈ ఏడాదిలో 142 మంది మావోయిస్టులు హతం: పోలీసులు
ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను శనివారం భద్రత దళాలు హతం చేశారు. వారి నుంచి భారీ మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 142 మంది మావోయిస్టులను హతం చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఇంద్రావతి అటవీ ప్రాంతంలో కూబింగ్ జరుగుతుందని, 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్‌ను నిలపడమే తమ లక్ష్యమని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.