కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఫాక్స్ సాగర్ చెరువు సమీపంలో గురువారం మెడికల్ వేస్టేజ్ లోడ్ డీసీఎం తగల బడింది. ఓ స్క్రాప్ షాప్ లో లోడ్ దించే క్రమంలో మంటలు చెలరేగాయి. డీసీఎం
పూర్తి మంటల్లో చిక్కుకున్నది. భయాందోళనలో పక్క స్క్రాప్ షాప్ నిర్వాహకులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.