
ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: నెతన్యాహు
ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోనూ ప్రాణనష్టం సంభవించింది. దీన్ని ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "మేం పూర్తి సామర్థ్యాలతో దాడులు చేస్తున్నాం. వారిపై మరింత విరుచుకుపడతాం. మా లక్ష్యాలను సాధిస్తాం’’ అని నెతన్యాహు తెలిపారు.