
అసెంబ్లీకి 60 రోజులు గైర్హాజరు.. జగన్ పై అనర్హత వేటు?
AP: స్పీకర్ అనుమతి లేకుండా ఎవరైనా ఎమ్మెల్యే 60 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం పోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో జగన్ రెండేళ్ళపాటు గైర్హాజరయ్యారని, ఆయనతోపాటు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకపోయినా అప్పట్లో జగన్ సభ్యత్వం పోలేదని వైసీపీ శ్రేణులు అంటున్నారు.