
నేను గాంధీ కుటుంబంలో భాగం కాబట్టి టార్గెట్ చేశారు: రాబర్ట్ వాద్రా
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా గురుగ్రామ్ భూమి కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గాంధీ కుటుంబంలో సభ్యుడిని కాబట్టే బీజేపీ టార్గెట్ చేస్తుందన్నారు. బీజేపీలో ఉండి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోనియా, రాహుల్ గాంధీలపై కూడా ఛార్జిషీట్ దాఖలు చేశారన్నారు.