
బిర్యానీలో బల్లి.. అడిగితే మంచిగా ఫ్రై అయింది తిను అన్న యజమాని
ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వడ్డించిన ప్లేటులో బల్లి కనిపించింది. వెంటనే యజమానిని ప్రశ్నించగా, “మంచిగా ఫ్రై అయింది, తినండి” అని సమాధానం ఇచ్చాడట. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బాధితుడు గుజ్జా కృష్ణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. షేరిగూడ పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.