
2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తాం: మంత్రి నారాయణ
ఏపీలోని పేదలకు మంత్రి శుభవార్త పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని మంత్రి చెప్పారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 63 కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తామన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని నారాయణ అన్నారు.